Lifestyle
పాలకూరలోని ఆక్సలైట్, టమాటలోని సిట్రిక్ యాసిడ్ కలిసి ఆక్సలేట్ రూపంలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లకు దారి తీస్తుంది.
పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాలు, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిస్తే శరీరంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
పాలకూర తిన్న వెంటనే సిట్రస్ పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కాల్షియం ఆక్సలేట్ తయారై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పాలకూర తిన్నవెంటనే చేపలు తినకూడదు. అలాగే చేపలు తినగానే పాలకూర తిన్నా జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీళ్ల నొప్పులున్న వారు కూడా పాలకూర దూరంగా ఉండడమే మంచిది. పాలకూరలోని ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పుల సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
రక్తం పలచగా మారడానికి ఆస్పిరిన్ వంటి మందులను ఉపయోగిస్తున్న వారు కూడా పాలకూరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.