Lifestyle

ఈ 2025లో ఇలా గనుక చేస్తే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది

Image credits: Getty

పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?

చాలా మంది కొత్త ఏడాదిలో అయినా పొట్ట సైజును తగ్గించుకోవాలని అనుకుంటారు. అయితే మీరు కొన్ని పనులు చేస్తే మాత్రం మీ ఈ కల తొందరగా నెరవేరుతుంది.

Image credits: Getty

ప్రోటీన్ ఫుడ్

బెల్లీ ఫ్యాట్ కరగాలన్నా, మీ బరువు తగ్గాలన్నా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజూ తినండి. ఎందుకంటే ప్రోటీన్లు ఆకలిని తగ్గిస్తాయి. అతిగా తినకుండా చేసి శరీర కొవ్వును కరిగిస్తాయి. 

Image credits: Getty

నీళ్లు ఎక్కువ తాగాలి

బరువు తగ్గాలన్నా, పొట్టను తగ్గించాలన్ని రోజూ నీళ్లను ఎక్కువగా తాగాలి. ఎందుకంటే నీళ్లు తాగితే ఆకలి తగ్గుతుంది. కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. 

Image credits: our own

తీపి పదార్థాలు మానేయండి

పొట్టను తగ్గించుకోవాలన్నా, బరువు పెరగకూడదన్నా ఖచ్చితంగా మీరు తీపి పదార్థాలు, స్వీట్లను అస్సలు తినకూడదు. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. పొట్టను పెంచుతాయి. 

Image credits: Instagram

పీచు పదార్థాలున్న ఆహారం

బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి పీచు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆకలిని తగ్గించి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.  

Image credits: Getty

వ్యాయామం అలవాటు చేసుకోండి

వ్యాయామం చేస్తే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. పొట్ట సైజు కూడా తగ్గుతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. 

Image credits: Getty

బాగా నిద్రపోవాలి

నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మీకు తెలుసా? నిద్రసరిగ్గా పోకుంటేనే పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది.

Image credits: social media

పిల్లలు గోళ్లు కొరికితే ఏమౌతుంది?

కొబ్బరి నీళ్లు కాదు.. కొబ్బరి పాలను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా

పరగడుపున ఖర్జూరం తింటే ఏమౌతుంది?

వరలక్ష్మి శరత్ కుమార్ 30 కేజీల బరువు ఎలా తగ్గిందో తెలుసా?