కాల్షియం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పాలు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం చాలా సులభంగా అందుతుంది.
పెరుగులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం లేదా స్నాక్ టైమ్‌లో పెరుగును మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.
పాలతో తయారయ్యే చీజ్‌లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. శాండ్‌విచ్ లేదా స్నాక్స్‌తో పాటు దీనిని మితంగా తీసుకోవచ్చు.
మన సంప్రదాయ ఆహారాల్లో ఒకటైన రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. రాగి జావ, దోశ, రొట్టె రూపంలో వీటిని వండుకుని తినొచ్చు.
చూడటానికి చిన్నగా ఉన్నా నువ్వుల్లో కాల్షియం దాగుంటుంది. నువ్వుల లడ్డూ, పొడి లేదా కూరల్లో వేసుకుని తినడం వల్ల కాల్షియం పెరుగుతుంది.
బాదంలో కాల్షియంతో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
పాల ఉత్పత్తులు పడని వారికి మొక్కల ఆధారిత టోఫు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. మీ రోజువారీ ఆహారంలో దీనిని సులభంగా చేర్చుకోవచ్చు.
శనగల్లో కూడా కాల్షియం లభిస్తుంది. వీటిని సలాడ్, కూరలు లేదా ఉడకబెట్టుకుని స్నాక్స్‌లాగా కూడా తినొచ్చు.
Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి
Shirt Blouse: పాత చొక్కాలు పారేస్తున్నారా? ట్రెండీ జాకెట్లుగా మార్చండి
Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి
Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్