Lifestyle
సిల్క్ పిల్లోకేస్ జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ డ్రైయర్ వాడుతున్నారు. అయితే, హెయిర్ డ్రైయర్ వాడటం వల్ల జుట్టు రాలుతుంది. కాబట్టి దాని వాడటం తగ్గించుకోండి.
మీ తలకు వాడే షాంపూ అయినా, నూనె అయినా మంచి ఉత్పత్తులను మాత్రమే వాడండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ జట్టు బలంగా, ఒత్తుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బయోటిన్, ఐరన్, ప్రోటీన్ ఉన్న ఆహారం మీ జుట్టుకు బలాన్ని ఇస్తాయి.
స్నానం చేసే ముందు నూనెతో తలకు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు బలంగా ఉంటాయి.
బలమైన జుట్టు కోసం పైన చెప్పిన విషయాలు పాటిస్తే మీ జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుంది.