Telugu

జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిన్న పనులు చేయండి

Telugu

కొబ్బరి నూనె

గోరువెచ్చని కొబ్బరి నూనెను తీసుకుని తలకు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఈ పద్ధతి కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అయితే, మీ చర్మానికి పడకపోతే దీన్ని వాడకపోవడం మంచిది.

Image credits: Getty
Telugu

మెంతి పేస్ట్

రాత్రంతా నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి తలకు పట్టించండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు మృదువుగా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

బియ్యం కడిగిన నీళ్లు

బియ్యం కడిగిన లేదా నానబెట్టిన నీళ్లను జుట్టుకు వాడటం వల్ల వెంట్రుకలు చిట్లిపోవడం తగ్గుతుంది. జుట్టుకు మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.

Image credits: Getty
Telugu

ఆవనూనె, కరివేపాకు

ఆవనూనెలో కరివేపాకు వేసి మరిగించి తలకు రాసుకోవడం ఒక పాత పద్ధతి. ఇది జుట్టుకు మంచి పోషణ ఇచ్చి బలంగా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

కలబంద గుజ్జు

కలబంద గుజ్జును తలకు రాసుకుంటే మాడు చల్లగా ఉంటుంది. ముందుగా కొద్దిగా రాసుకుని, అలర్జీ రాకపోతేనే పూర్తిగా వాడండి.

Image credits: Getty
Telugu

మందారం

మందారం పూలు, ఆకులను మెత్తగా నూరి హెయిర్ మాస్క్‌లా వేసుకోండి. ఇది జుట్టు పల్చబడటాన్ని ఆపి, కుదుళ్లకు పోషణ ఇస్తుంది.

Image credits: Getty

Gold Rings: అమ్మాయిల మనసు దోచే గోల్డ్ రింగ్స్.. డిజైన్స్ అదుర్స్!

Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు

Sarees: పండగలు, ఫంక్షన్లకు ఈ చీరలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!

Bangles Set:పట్టుచీరల మీదకు మ్యాచింగ్ గాజుల సెట్స్.. చూపు తిప్పుకోలేరు