Lifestyle

చంకల్లో నలుపును పోగొట్టే చిట్కాలు

Image credits: Freepik

కీరదోసకాయ ముక్కలు

కీరదోసకాయ ముక్కలను మీ అండర్ ఆర్మ్స్ మీద రుద్దండి లేదా కీరదోసకాయ రసాన్ని అక్కడ అప్లై చేయండి. అయితే దీన్ని అప్లై చేయడానికి ముందు సుమారు 10 నిమిషాల పాటు చంకలను పొడిగా ఉంచండి.

Image credits: Freepik

పసుపు, పాలు

చిటికెడు పసుపు పొడిని తీసుకుని అందులో కొన్ని పాలను పోసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ అండర్ ఆర్మ్స్‌కి అప్లై చేయండి.  10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 
 

Image credits: Freepik

కొబ్బరి నూనే

కొబ్బరి నూనెను మీ అండర్ ఆర్మ్స్‌లో క్రమం తప్పకుండా రాసి మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మరింత నల్లబడకుండా ఉంటుంది. దీన్ని కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచండి.

Image credits: Freepik

అలోవెరా జెల్

తాజా అలోవెరా జెల్‌ను తీసుకుని మీ అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అలోవెరా జెల్ చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటుగా చికాకును తగ్గిస్తుంది.

Image credits: Freepik

బేకింగ్ సోడా, నీరు

బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి మీ అండర్ ఆర్మ్స్‌ కు అప్లై చేసి సున్నితంగా స్క్రబ్ చేయండి. దీన్ని పూర్తిగా ఆరనివ్వండి. స్క్రబ్బింగ్‌ ఎక్కువచేస్తే చికాకు కలుగుతుంది.

Image credits: Freepik

బంగాళదుంప ముక్కలు

బంగాళాదుంపను ముక్కలుగా కట్ చేసి మీ అండర్ ఆర్మ్స్‌పై కొన్ని నిమిషాల పాటు రుద్దండి. దీన్ని శుభ్రం చేయడానికి ముందు సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. 
 

Image credits: Freepik

నిమ్మరసం, చక్కెర స్క్రబ్

చంకల చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి చక్కెరలో నిమ్మరసాన్ని కలిపి స్క్రబ్‌ ను తయారుచేయండి. చక్కెర సహజమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
 

Image credits: Freepik

మధ్యాహ్నం తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి..

బొప్పాయిని రోజూ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసా?

పచ్చి పసుపు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?