Lifestyle

హాయిగా నిద్రపోతే చాలు: 10 లక్షలు ఇస్తారు. మీకు ఈ జాబ్ కావాలా?

వేక్‌ఫిట్‌లో నిద్ర ఉద్యోగం

నిద్ర ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ వేక్‌ఫిట్ ఒక స్లీప్ ఇంటర్న్‌షిప్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు నెలల పాటు నిద్రపోవడానికి మీకు రూ.10 లక్షలు చెల్లిస్తారు.

ఎవరికి ఖాళీలు ఉన్నాయి?

వేక్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఇంటర్న్‌షిప్ వివరాలను అందించారు. దరఖాస్తు చేసుకోవడానికి https://bit.ly/4fW31N7 లింక్‌ను సందర్శించండి.

ఉద్యోగం ఎక్కడ?

ఈ ఉద్యోగంలో చేరితే మీరు చేయాల్సిందల్లా మంచం మీద పడుకుని నిద్రపోవడమేనని వేక్‌ఫిట్ తెలిపింది. అంటే మీ ఆఫీస్ మీ మంచమే. ఈ ఉద్యోగం రెండు నెలల పాటు మాత్రమే ఉంటుంది.

ఎన్ని గంటలు నిద్రపోవాలి?

'మీరు స్ప్రెడ్‌షీట్‌ల కంటే బెడ్‌షీట్‌లను ఇష్టపడితే, డైలీ వర్క్ లో భాగంగా 9 గంటలు నిద్రపోవాలని అనుకుంటే, మీకోసం మా దగ్గర ఓ ఆఫర్ ఉంది' అని వేక్‌ఫిట్ తన ప్రకటనలో పేర్కొంది.

జీతం ఎంత?

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.లక్ష గ్యారెంటీడ్ స్టైపెండ్ లభిస్తుందని వేక్‌ఫిట్ తెలిపింది. స్లీప్ ఛాంపియన్‌గా నిలిచే అభ్యర్థి రూ.10 లక్షలు పొందవచ్చు. 

అర్హతలు ఏమిటి?

గ్రాడ్యుయేషన్ డిగ్రీ, దిండును సరిగ్గా ఉపయోగించడం, గొడవలు లేకుండా నిద్రపోవడం ఈ ఉద్యోగానికి అర్హతలు. నిద్రకు సాకులు వెతుక్కోవడం వంటి విషయాలు కూడా ఇంటర్వూలో అడుగుతారు. 

వీళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

టీమ్ మీటింగ్‌లు, మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నప్పుడు, ట్రాఫిక్‌లో నిద్రపోయేవారు, వారాంతాల్లో ప్లాన్ చేసుకుని నిద్రపోయేవారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్యూర్ పట్టుచీరను గుర్తించేదెలా?

ప్రేమ, బంధాలపై శ్రీకృష్ణుడి అద్భుతమైన బోధనలు

ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉన్న ఆహారాలు

రోజూ దనియాల వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?