Washing Machine: వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు
life Apr 09 2026
Author: ramya Sridhar Image Credits:freepik
Telugu
ఈ పొరపాట్లు చేయకూడదు..
వాషింగ్ మెషిన్ ని శుభ్రం చేయకపోవడం, వేడి నీళ్లు వాడకపోవడం, ఎక్కువ బట్టలు వేయడం, ఎక్కువ డిటర్జెంట్ వాడటం చేయడం వల్ల దుస్తులు పాడౌతాయి.
Image credits: Getty
Telugu
జిప్ వేయడం మర్చిపోవద్దు
జీన్స్ ప్యాంట్లు, ఇతర దుస్తులను వాషింగ్ మెషీన్‌లో వేసే ముందు వాటి జిప్‌లను తప్పకుండా మూసేయాలి. లేదంటే, ఆ జిప్‌లు ఇతర బట్టలకు తగిలి చిరిగిపోయే ప్రమాదం ఉంది.
Image credits: freepik
Telugu
వాషింగ్ మెషీన్‌ను క్లీన్ చేయకపోవడం
వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయకుండా వదిలేస్తే, అందులో మురికి, బాక్టీరియా పేరుకుపోతుంది. కాబట్టి, నెలకు ఒక్కసారైనా తప్పనిసరిగా మెషీన్‌ను క్లీన్ చేయాలి.
Image credits: Getty
Telugu
వేడి నీళ్లు అస్సలు వాడొద్దు
వేడి నీళ్లు బట్టల రంగును పోగొడతాయి. కొన్ని రకాల బట్టలు ముడుచుకుపోయేలా చేస్తాయి. అందుకే, బట్టలు ఉతకడానికి చల్లటి నీటిని వాడటం ఉత్తమం. దీనివల్ల బట్టలు మృదువుగా ఉంటాయి.
Image credits: social media
Telugu
అన్నీ కలిపి ఉతకొద్దు
బట్టలను రంగుల ఆధారంగా వేరు చేయాలి. తెలుపు, లేత రంగు, ముదురు రంగు బట్టలను విడివిడిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికితే, ఒకదాని రంగు మరొకదానికి అంటుకుంటుంది.
Image credits: freepik
Telugu
ఎక్కువ డిటర్జెంట్ వాడొద్దు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువ డిటర్జెంట్ వాడకూడదు. అలా వాడితే, అది బట్టలపై తెల్లటి మరకల్లా పేరుకుపోతుంది. ఇది కొంతమందిలో స్కిల్ అలెర్జీలకు కారణం అవుతాయి.
Image credits: Freepik
Telugu
ఓవర్‌లోడ్ చేయొద్దు
మెషీన్‌లో కెపాసిటీకి మించి బట్టలు వేస్తే, అవి సరిగ్గా శుభ్రం కావు. అంతేకాదు, బట్టల మధ్య ఎక్కువ రాపిడి జరిగి, త్వరగా పాడైపోతాయి లేదా చిరిగిపోతాయి.
Image credits: Freepik
Telugu
లేబుల్స్ చదవడం మర్చిపోవద్దు
ప్రతి బట్టపై దాని ఫ్యాబ్రిక్, వాషింగ్ సూచనలతో కూడిన ఒక లేబుల్ ఉంటుంది. ఆ సూచనలను చదివి, వాటి ప్రకారమే బట్టలను ఉతకాలి. అప్పుడే బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి.