బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ తప్పనిసరి. చాలా మంది ఇంట్లో సన్ స్క్రీన్ రాయరు. కిటికీలో నుంచి వచ్చే యూవీ కిరణాలు కూడా చర్మాన్ని దెబ్బతీస్తాయి.
Image credits: Asianet News
Telugu
మాయిశ్చరైజర్ అస్సలు మానొద్దు
వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటుందని మాయిశ్చరైజర్ వాడటం మానేస్తే, చర్మం మరింత పొడిబారిపోతుంది. అందుకే, జిడ్డు లేని, తేలికపాటి (లైట్ వెయిట్) మాయిశ్చరైజర్ ఎంచుకోండి.
Image credits: Asianet News
Telugu
అతిగా ఎక్స్‌ఫోలియేట్ చేయొద్దు
ఎండకాలంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా స్క్రబ్ చేస్తే చర్మంపై ఉండే సహజమైన రక్షణ పొర దెబ్బతింటుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు.
Image credits: Asianet News
Telugu
స్కిన్‌కేర్ ఉత్పత్తులను మార్చండి
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా మీ స్కిన్‌కేర్ ఉత్పత్తులను కూడా మార్చాలి. ముఖ్యంగా మీరు వాడే సీరమ్స్, క్రీమ్స్ వేసవికి సరిపోయేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
Image credits: Asianet News
Telugu
చెమటను చర్మంపై ఆరనివ్వద్దు
ముఖంపై చెమట అలాగే ఆరిపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల బ్యాక్టీరియా చేరి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
Image credits: Asianet News
Telugu
తగినన్ని నీళ్లు తాగడం మర్చిపోవద్దు
చర్మ సౌందర్యానికి బయటి సంరక్షణతో పాటు, లోపలి నుంచి పోషణ కూడా అవసరం. శరీరానికి అవసరమైన నీటిని అందిస్తే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.