Lifestyle

జుట్టు రాలడానికి కామన్ రీజన్స్ ఇవే..!

Image credits: Freepik

జెనెటిక్స్

జెనెటిక్స్ వల్ల కూడా జుట్టు రాలుతుంది అన్న సంగతి చాలా వక్కువ మందికే తెలుసు. మీ కుటుంబానికి వెంట్రుకలు పల్చబడటం లేదా బట్టతల ఉన్న చరిత్ర ఉన్నట్టైతే ఈ సమస్య మీకూ ఉంటుంది.

Image credits: freepik

హార్మోన్ల మార్పులు

హార్మోన్ల మార్పులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. ప్రెగ్నెన్సీ, డెలివరీ, రుతువిరతి లేదా థైరాయిడ్ వంటి సమస్యలు హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. దీంతో జుట్టు రాలుతుంది. 
 

Image credits: Getty

ఒత్తిడి, ఆందోళన

శారీరక లేదా భావోద్వేగ ఒత్తిడి టెలోజెన్ ఎఫ్లువియం అనే పరిస్థితికి దారి తీస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు విశ్రాంతి దశలోకి వెళతాయి. దీంతో జుట్టు బాగా రాలుతుంది. 
 

Image credits: Getty

పోషకాహార లోపాలు

జింక్, ఇనుము, బయోటిన్ వంటి అవసరమైన పోషకాలు మీ శరీరంలో లోపించడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలాగే జుట్టు రాలడానికి దారితీస్తుంది. మీ జుట్టు బలంగా ఉండాలంటే పోషకాహారం తినాలి.
 

Image credits: Getty

ధూమపానం, మద్యపానం

ఈ అలవాట్లు మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. స్మోకింగ్ హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మందును ఎక్కువగా తాగడం వల్ల అవసరమైన పోషకాలు అందవు. 
 

Image credits: Getty

ఆరోగ్య సమస్యలు

అలోపేసియా అరేటా, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు వంటి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఈ సమస్యలకు చికిత్స ఖచ్చితంగా అవసరం.
 

Image credits: Getty

కేశాలంకరణ, జుట్టు చికిత్సలు

టైట్ గా  ఉండే హెయిర్‌స్టైల్స్ జడలు, పోనీటెయిల్స్ వల్ల జుట్టు బాగా లాగుతుంది. దీనివల్ల వెంట్రకల మూలాలు బలహీనపడతాయి. అలాగే హీట్ స్టైలింగ్ టూల్స్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. 

Image credits: freepik
Find Next One