ఆచార్య చాణక్య చెప్పిన సూక్తులు నేటికీ మనకు ఉపయోగపడుతున్నాయి. వీటిని అనుసరిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. చాణక్యుడు విలువైన ఆర్థిక సలహాలను కూడా అందించారు.
Telugu
ఎవరికి ఆర్థిక స్థర్థత ఉంటుంది?
చాణక్య సలహాలను పాటిస్తే గనుక ఆర్థిక ఇబ్బందులే రావు. ఇంట్లో తగినంత డబ్బు ఉండేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Telugu
1. అనవసర ఖర్చులు మానుకోండి
ఆచార్య చాణక్య ప్రకారం.. డబ్బుకు సంబంధించిన సమస్యలు రావొద్దంటే.. ఎప్పుడూ కూడా తమ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి.
Telugu
2. లోభంతో డబ్బు నిలవదు
ఎవ్వరైనా సరే డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. కానీ అవసరమైన పనుల కోసం ఖర్చు చేయకూడదు. దీనివల్ల మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Telugu
3. చెడు పనులకు ఖర్చు చేయొద్దు
భవిష్యుత్తులో డబ్బు కష్టాలు రావొద్దంటే మీరు చెడు పనుల కోసం డబ్బును ఖర్చు చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా సరే డబ్బును మంచి పనుల కోసమే ఉపయోగించాలి.
Telugu
4. పని చేయని వారు
ఏ పనీ చేయకుండా ఇతరులపై ఆధారపడే వారు ఎన్నటికీ పేదవారిగానే ఉంటారు. ఇలాంటి వారికి జీవితాంతం డబ్బు సమస్యలు వస్తాయి. అందుకే ఇతరులపై ఆధారపడకుండా కష్టం చేసుకుని బతకడం నేర్చుకోవాలి.
Telugu
5. లక్ష్మి వీరితో ఉండదు
చాణక్య నీతి ప్రకారం.. అపరిశుభ్రంగా జీవించేవారు, చిరిగిన బట్టలు ధరించేవారు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.