ఒక్క రాత్రిలో దయ్యాలు నిర్మించిన ఆలయం ఇది: ఎక్కడుందో తెలుసా
Telugu
అందుకే అసంపూర్తిగా నిర్మాణం
కకన్‌మఠ్ ఆలయాన్ని ఒకే రాత్రిలో భూతాలు నిర్మించాయని చెబుతారు. తెల్లవారే సరికి నిర్మాణం పూర్తికాకపోవడంతో దయ్యాలు వెళ్లిపోయాయట. అందుకే అసంపూర్ణంగా ఆగిపోయిందని ఒక కథ.
Telugu
కకన్‌మఠ్ ఎక్కడ?
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలోని సిహోనియాలో కకన్‌మఠ్ ఆలయం ఉంది. నిర్మాణ శైలి, రహస్య కథలకు ఇది ప్రసిద్ధి.
Telugu
రాళ్లు ఎక్కడ నుంచి తెచ్చారో?
సిమెంట్, సున్నం లేకుండా నిర్మించిన ఈ ఆలయంలోని రాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరకవు.
Telugu
11వ శతాబ్దపు చరిత్ర
కచ్వాహా వంశ రాజు కీర్తి సింగ్, తన భార్య కకన్వతి కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని మరో కథ ప్రచారంలో ఉంది.
Telugu
శిథిలాలు అద్భుతం
ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కొన్ని కకన్‌మఠ్ ఆలయ అవశేషాలు గ్వాలియర్ మ్యూజియంలో ఉన్నాయి.
Telugu
ప్రకృతి విపత్తులకు తట్టుకొని..
కకన్‌మఠ్ ఆలయం తుఫానులను లెక్క చేయకుండా నిలిచింది. ఎన్ని వచ్చినా చెక్కచెదరలేదు. భూకంపాలను తట్టుకుని నిలిచిన అద్భుతమైన ఆలయం ఇది.
Telugu
రహస్య నిర్మాణం
ఆలయ నిర్మాణానికి వాడిన అతి పెద్ద రాళ్లను ఎలా తెచ్చారన్నది ఇప్పటికీ మిస్టరీనే. భారీ రాళ్ళ రవాణా ఎలా జరిగింది. ఆలయం పైకి ఎలా ఎక్కించారన్నది ఇప్పటికీ రహస్యమే.
Telugu
కళ, చరిత్ర, రహస్యాల కలయిక
ఈ ఆలయంపై ఎన్నో కథలు ఉన్నాయి. దేవాలయం చరిత్ర, వాస్తుకళ, రహస్య కథలపై ఆసక్తి ఉన్నవారు ఈ ఆలయాన్ని తప్పక చూడాలి.