Lifestyle

చాణక్య నీతి: భార్య చేసే ఏ తప్పులను భర్త క్షమించాలి?

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

 

హిందూ ధర్మంలో భార్యభర్తలు ఒకరికొకరు అన్నట్లుగా జీవించాలి. సుఖమైన వైవాహిక జీవితం కోసం భర్త.. తన భార్య  చేసే కొన్ని తప్పులను క్షమించాలట. అవేంటో తెలుసుకుందాం

 

డబ్బులు తీయడం

తరచుగా భార్యలు తమ భర్తల జేబులోంచి అడగకుండా డబ్బు తీస్తూ ఉంటారు. డబ్బు తీసిన విషయం భర్తకు తెలిసినా గొడవ చేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బు ఆమె ఇంటి అవసరాలకే వాడుతుంది.

 

 

పిల్లలపై కోపం తెచ్చుకుంటే

చాలాసార్లు భార్యలు పిల్లల అల్లరితో విసిగి వారిపై కోపం తెచ్చుకుని, కొట్టడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో భార్యతో గొడవ పడకండి. ఎందుకంటే వారు పిల్లల మంచి కోసమే కోపగిస్తారు.

చిన్న చిన్న తప్పులు చేస్తే

ఏదైనా పని చేస్తున్నప్పుడు భార్య చిన్న చిన్న తప్పులు చేస్తే భర్త గొడవ పడకూడదు ఎందుకంటే పనిలో ఇలాంటి తప్పులు జరగడం సహజం.

ఏదైనా పని ఆలస్యమైతే

భార్య ఏదైనా పని ఆలస్యం చేస్తే భర్త ముందు ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. విషయం తెలుసుకోకుండా భార్యతో గొడవ పడటం మంచిది కాదు.

భార్య వల్ల నష్టం జరిగితే

భార్య వల్ల డబ్బు నష్టం జరిగినా భర్త గొడవ పడకూడదు ఎందుకంటే అలాంటిది ఎవరి వల్లైనా జరగవచ్చు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా డబ్బు నష్టం చేయరు.

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా

అత్తగారితో అల్లుడు మాట్లాడకూడని విషయాలు

రోజుకు మూడు ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఉదయాన్నే కాఫీ తాగితే ఏమౌతుంది?