Food
ఖర్జూరాల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ సి, విటమిన్ కె తో పాటుగా ఎన్నో పోషకాలుంటాయి.
ఖర్జూరాలు మన ఎముకల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 100 గ్రాముల ఖర్జూరాల్లో 64 మి.గ్రా. కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా ఉంచుతుంది.
ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించడమే కాకుండా.. మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది. రోజూ మూడు ఖర్జూరాలను తింటే మీ జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
ఖర్జూరాలు హైబీపీని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. 100 గ్రా. ఖర్జూరంలో 696 మి.గ్రా. పొటాషియం, 54 మి.గ్రా. మెగ్నీషియం, 0.9 మి.గ్రా. ఇనుము ఉంటాయి.ఇవి బీపిని నియంత్రిస్తాయి.
రోజూ మూడు ఖర్జూరాలను తింటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఖర్జూరాలను తింటే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి గుండె జబ్బులను రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాలు ఆడవాళ్లకు చాలా మంచివి. ఎందుకంటే ఇవి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. మీరు రోజూ మూడు ఖర్జూరాలను తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది.