Lifestyle
ధనవంతులు కావాలని అందరూ కోరుకుంటారు. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడతారు. కానీ అందరూ ధనవంతులు కాలేరు.
చాణక్యుడి ప్రకారం, ధనవంతులు కావాలంటే కొన్ని నీతులు పాటించాలి. ఇవే ధన, కీర్తి ప్రాప్తికి దారులు.
ధనవంతులు కావాలంటే కష్టపడి పనిచేయాలని చాణక్యుడు చెప్పారు. కష్టార్జితం సంతృప్తినిస్తుంది. కష్టపడితే విజయం తథ్యం.
కష్టకాలాల్లోనూ నీతి నిజాయితీగా ఉండాలని, సూత్రాలకు కట్టుబడి ఉండాలని చాణక్యుడు చెప్పారు. ఇది సహాయం అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది.
ధనవంతులు కావాలంటే క్రమశిక్షణ పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. క్రమశిక్షణతో ఉంటే వ్యక్తిని విజయం వరించడం ఖాయం.
రిస్క్ తీసుకోవడానికి భయపడేవారు విజయం సాధించలేరని చాణక్య నీతి. ధనవంతులు కావాలంటే రిస్క్ తీసుకోవాలి.
సోమరిపోతులకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. వారి ప్రేరణ లేమి మన ప్రగతికి ఆటంకం కలిగిస్తుంది.