Food

అన్నం, చపాతీలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయవచ్చా?

మిగిలిపోయిన ఆహారం

ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేనివారు ఎవరూ లేరు. మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్లు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు.

 

ఎక్కువ రోజులు

తరచుగా మనం మిగిలిపోయిన అన్నం, రొట్టె, పప్పు లేదా కూరలను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తాం. అవి చాలా రోజులు అందులోనే ఉంటాయి. కానీ నిర్ణీత సమయం తర్వాత అలాంటి ఆహారం తినడం అనారోగ్యం 

ఫ్రిడ్జ్‌లో బ్యాక్టీరియా పెరుగుతాయి

పచ్చి, వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో కలిపి ఉంచితే బ్యాక్టీరియా పెరుగుతాయి. దీనివల్ల వండిన ఆహారం పాడవుతుంది. కాబట్టి తక్కువ రోజుల్లో తినడం ముఖ్యం.

అన్నాన్ని ఎన్ని రోజులు

తాజాగా వండిన ఆహారమే ఆరోగ్యకరం. కానీ ఎక్కువ అన్నం మిగిలిపోతే, ఫ్రిడ్జ్‌లో రెండు రోజులు మాత్రమే నిల్వ చేయండి.

చపాతీ, రోటీలు

వేడి వేడి రొట్టె ఆరోగ్యకరం. కానీ ఫ్రిడ్జ్‌లో ఉంచితే 2-3 రోజుల్లో తినేయాలి. లేదంటే బ్యాక్టీరియా పెరుగుతాయి.

కూర

వండిన కూరను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయండి. కానీ రెండు రోజుల వరకే. ఎక్కువ రోజులు ఉంచితే పోషకాలు తగ్గిపోతాయి, ఆరోగ్యానికి హానికరం.

పప్పు

పప్పును కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయకూడదు. రెండు రోజుల్లో తినేయాలి, లేదంటే పారేయాలి. ఎక్కువ రోజుల తర్వాత తింటే గ్యాస్ సమస్య వస్తుంది.

కట్ చేసిన పండ్లు

కట్ చేసిన పండ్లను ఫ్రిడ్జ్‌లో ఒక రోజు మాత్రమే ఉంచండి. ఎక్కువ రోజులు ఉంచితే పాడవుతాయి. ఆపిల్‌ను 4 గంటల్లో తినేయాలి, లేదంటే నల్లగా మారుతుంది.

ఆహారం ఉంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఫ్రిడ్జ్‌లో ఉంచే ముందు అన్నం, రొట్టె బాగా చల్లారనివ్వండి. ఆహారాన్ని airtight కంటైనర్‌లో నిల్వ చేయండి. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత 4°C (40°F) లేదా అంతకన్నా తక్కువ ఉంచండి.

ఎర్ర అరటిపండ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

రోజుకో అల్లం టీ.. ఆ సమస్యలిక రమ్మన్నా రావు!

బర్గర్, సమోసాలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?

రవ్వతో ఇన్ని బ్రేక్ ఫాస్టులు చేయచ్చా?