చాణక్య నీతి.. మనుషులకు ఇవి ఎంతున్నా సరిపోవు.. ఇంకా కావాలనిపిస్తుంది
చాణక్య నీతి
చాణక్యుడు.. మనుషుల దగ్గర కొన్ని వస్తువులు ఉన్నా.. మనసు నిండదు. ఇవి ఇంకా ఇంకా ఉండాలని ఆశపడతరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డబ్బు
మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా.. చాలు అనుకోడు. ఇంకా ఇంకా కూడబెట్టాలని చూస్తారు. దీనికోసం మనుషులు చెడు దారుల్లో నడవడానికి కూడా వెనకాడరు.
ఎవరూ చావాలనుకోరు
ఏదో ఒక రోజు మనం చనిపోతామని అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ కూడా తాము చాలా చావాలని కోరుకోరు. బతకాలనే ఆశపడతారు. వృద్ధులైనా సరే ఇంకొన్ని రోజులు బతకాలని కోరుకుంటారు.
స్త్రీ సుఖం
కొంతమంది మగవారు ఒక స్త్రీతో సంతృప్తి పడరు. ఇలాంటి వారే భార్య కాకుండా పర స్త్రీలవైపు ఆకర్షితులవుతారు. తప్పుల మీద తప్పులు చేసి సమస్యల పాలవుతారు.
రుచికరమైన ఆహారం
కొంతమందికి ఫుడ్ అంటే ఎక్కడలేని ఇష్టం. వీళ్లు తినడానికి మాత్రమే బతుకుతారు. వీరికి ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా తృప్తి ఉండదు. ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా తక్కువ అనిపిస్తుంది.