Lifestyle
మీరు వేసుకునే దుస్తులు మీకు కంఫర్ట్ గా ఉంటే చాలు. మీ డ్రెస్సింగ్ స్టైల్ ని మరెవరి కోసమో మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.
మీకు నచ్చిన ఆహారం తినండి. మీరు మాంసాహారులు అయ్యిండి.. మరొకరు చెప్పారని శాఖాహారాలుగా మారడం మంచిది కాదు. మీకు నచ్చింది తినడం మీ హక్కు.
మీకు పాటలు వినడం ఇష్టమైతే, మీ స్నేహితులకు లేదా ప్రియుడికి నచ్చకపోతే మార్చుకోకండి. సంగీతం మీ వ్యక్తిగత అభిరుచి. ఎవరి ఒత్తిడికీ లొంగకండి.
మీకు ఆర్ట్స్ చదవాలని ఉంటే, సైన్స్ చదవమని తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగకండి. మీ కెరీర్ మీరే ఎంచుకోండి, లేకపోతే మీకు నచ్చని సబ్జెక్టులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
HR మీకు తక్కువ జీతం ఇవ్వాలని చూస్తే, మీ విలువను తెలుసుకొని రాజీ పడకండి.
మీ భాగస్వామికి మీ స్నేహితులు నచ్చకపోతే వారి కోసం స్నేహితుల్ని వదులుకోకండి. స్నేహితులు మీ జీవితంలో ముఖ్యమైన భాగం.
సమయాన్ని విలువైనదిగా భావిస్తే, దాన్ని వృధా చేయకండి. మీ దినచర్యలో ఎవరి జోక్యానికి అనుమతించకండి.
నటుడు/నటి కావాలని, నాయకుడు కావాలని లేదా ఏదైనా కావాలని మీ కల అయితే, అది అసాధ్యం అని ఎవరైనా చెబితే వదులుకోకండి. మీ కలల కోసం పోరాడండి.
మీ పాత ఫోన్‌తో అనుబంధం ఉంటే, ఇతరులు చెప్పినంత మాత్రాన కొత్తది కొనకండి. మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.
ఎవరైనా మిమ్మల్ని లావు అంటే, మీ శరీరాన్ని ద్వేషించుకోకండి. దాన్ని హింసించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి.