Woman
పీరియడ్స్ సమయంలో మనం వేసుకునే దుస్తులపై రక్తపు మరకలు అంటుకుంటూ ఉంటాయి. వాటిని ఈజీగా తొలగించే చిట్కాలు ఒకసారి చూద్దాం...
బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి, మరక ఉన్న చోట రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చీరను తేలికగా రుద్ది, ఉతికివేయండి.
ఒక బకెట్ నీటిలో 2 స్పూన్ల వెనిగర్, కొద్దిగా డిటర్జెంట్ కలపండి. చీరను 30 నిమిషాలు నానబెట్టి, ఉతికివేయండి. వెనిగర్ మరకను తేలిక చేస్తుంది.
మరక ఉన్న చోట నిమ్మరసం పిండి, కొద్దిగా ఉప్పు చల్లుకోండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, తేలికగా రుద్దండి. మరక పోతుంది. తర్వాత నీటిలో శుభ్రంగా ఉతుక్కోండి.
మరక మొండిగా ఉంటే, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడండి. దాన్ని నేరుగా మరకపై పోసి, కొంతసేపు అలాగే ఉంచండి. తర్వాత సాధారణంగా ఉతుక్కోండి.
Chanakya Niti: చాణక్య నీతి.. ఆడవాళ్లు ఎలాంటి వారంటే?
వరలక్ష్మి శరత్ కుమార్ 30 కేజీల బరువు ఎలా తగ్గిందో తెలుసా?
పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి
ముఖం నిండా మొటిమలు, నల్ల మచ్చలు.. ఆ మేకప్ వేసుకుంటే జరిగేది ఇదే