Lifestyle
క్యాన్సర్ అంటే ప్రాణాంతకం. అయితే, బ్లడ్ క్యాన్సర్ ను ఆరంభంలో గుర్తించవచ్చు. ఆ లక్షణాలను అస్సలు ఇగ్నోర్ చేయకండి.
బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తికి తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
చిన్న గాయాలైనా ఎక్కువసేపు రక్తస్రావం అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
ముక్కు, నోరు, మలం, మూత్ర మార్గాల నుండి అసాధారణ రక్తస్రావం జరుగుతుంటే జాగ్రత్తగా ఉండటం, వైద్యులను సంప్రదించడం కీలకం.
ఎముకలు లేదా కీళ్లలో నిరంతర నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకండి.
బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు అసాధారణంగా తక్కువగా ఉంటాయి. ఇది రక్తహీనత, అలసటకు దారితీస్తుంది.
అసాధారణంగా బరువు తగ్గడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణంగా ఉంది.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే బ్లడ్ క్యాన్సర్ ఉంది అని కాదు. వైద్యుల సంప్రదించి రోగ నిర్ధారణ చేసుకోండి. కేవలం ఇవి వైద్యులు చెబుతున్న సలహాలు,సూచనలు.