సాల్మన్, మాకేరెల్, సార్డిన్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
ఆకుకూరల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
పెరుగు
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే మనోభావాలను నియంత్రించే సెరోటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది.
Image credits: AI Generated
Telugu
నట్స్
బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి మనసుకు ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
Image credits: Getty
Telugu
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటు సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లను ప్రేరేపిస్తాయి.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీలో 'ఎల్-థియానిన్' (L-theanine) అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, కార్టిసాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి బాగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ, బ్లూబెర్రీలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఒత్తిడి వల్ల కణాలకు జరిగే నష్టాన్ని అడ్డుకుని రక్షణ కల్పిస్తాయి.