ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి పూట వేయాల్సిన యోగాాసనాలివే..
life Oct 22 2026
Author: Arun Kumar P Image Credits:Getty
Telugu
సింపుల్ యోగాసనాలు
కొన్ని సింపుల్ యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను ఇస్తాయి. రాత్రి భోజనం తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో శ్వాసపై ధ్యాస పెట్టి ఈ ఆసనాలు వేయండి.
Image credits: Getty
Telugu
బాలాసనం (Balasana)
మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి చేతులను చాపే ఈ ఆసనం నరాలను శాంతపరుస్తుంది. ఇది మెడ, నడుము నొప్పిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
విపరీత కరణి (Viparita Karani)
గోడకు ఆనించి కాళ్లను పైకి ఎత్తే ఈ సింపుల్ ఆసనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీర అలసటను తగ్గించి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
బద్ధ కోణాసనం (Baddha Konasana)
రెండు పాదాలను కలిపి ఉంచి కాళ్లను మడవాలి. ఈ ఆసనం నడుము కండరాలను వదులు చేసి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఆందోళనను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
సుప్త మత్స్యేంద్రాసనం (Supta Matsyendrasana)
వెల్లకిలా పడుకుని శరీరాన్ని అటూ ఇటూ తిప్పడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
Image credits: Getty
Telugu
శవాసనం (Savasana)
చివరగా కాళ్లు, చేతులను వదులుగా వదిలేసి ప్రశాంతంగా పడుకునే శవాసనం వేయాలి. ఇది శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చి, గాఢమైన నిద్రకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.