White Hair: తమలపాకులు ఇలా రాస్తే, తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా
life Jun 17 2025
Author: ramya Sridhar Image Credits:social media
Telugu
తెల్ల జుట్టుకు ఇలా చెక్ పెట్టండి..
ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు కెమికల్స్ లేకుండా, తమలపాకుతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
Image credits: our own
Telugu
తమలపాకులను ఎలా వాడాలి?
ఒక పాత్రలో 15-20 తమలపాకులను మరిగించండి. ఈ నీటిని చల్లబరిచి, దానితో మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మార్పు చూస్తారు.
Image credits: our own
Telugu
తమలపాకు ప్రయోజనాలు..
తమలపాకులకు యాంటీ-మైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది తలపై ఇన్ఫెక్షన్ల సమస్యను పరిష్కరిస్తుంది.
Image credits: our own
Telugu
తమలపాకు హెయిర్ ప్యాక్..
తమలపాకు , నెయ్యితో చేసిన హెయిర్ ప్యాక్ జుట్టును మందంగా చేయడంలో సహాయపడుతుంది. 15-20 తమలపాకులను రుబ్బి దానికి స్పూన్ నెయ్యి జోడించాలి.. తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి.
Image credits: Social media
Telugu
తమలపాకు నూనె..
తమలపాకు నూనె కోసం, కొబ్బరి లేదా ఆవ నూనెలో 15 తమలపాకులను తక్కువ వేడి మీద మరిగించండి.ఆకులు నల్లగా మారిన తర్వాత, ఈ నూనెను వడకట్టి,తల, జుట్టుకు రాయాలి. మరుసటి రోజు తలస్నానం చేస్తే సరి.
Image credits: Social media
Telugu
తమలపాకులు తిన్నా...
మీరు ఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.