Lifestyle
మీ ముఖం అందంగా, మెరిసేలా చేయడానికి మందార పువ్వును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మందార పువ్వును బాగా ఎండబెట్టి పొడిగా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోండి.
మందారలో ముల్తానీ మట్టి, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. నిద్రపోవడానికి ముందు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి.
ముఖంపై మురికిని తొలగించాలంటే మందార పొడిలో పంచదార, శనగపిండి, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోండి. దీనివల్ల ముఖానికి పట్టిన మురికంతా పోతుంది.
మందార పువ్వును గ్రైండ్ చేసి అలోవెరా జెల్ ను కలపండి. ఈ ఫ్యాక్ ను ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేయండి.
మందార పొడిలో టమాటా రసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి.