అసలైన బనారస్ పట్టు చీరలను చేత్తో నేస్తారు. చక్కని ఎంబ్రాయిడరీతో ఉంటాయి. చీరను తిప్పి చూస్తే వెనుక వైపు దారాలు ఉంటే అది అసలైందని అర్థం.
అసలైన బనారస్ పట్టు చీర కొంచెం బరువుగా ఉంటుంది. అందులో స్వచ్ఛమైన పట్టు దారాలు, అసలైన జరీ ఉంటుంది. చీర చాలా తేలికగా ఉంటే అది నకిలీది కావచ్చు.
అసలైన బనారస్ చీరల్లో స్వచ్ఛమైన బంగారం-వెండి జరీ వాడతారు. కానీ కొత్త చీరల్లో నకిలీ జరీ వాడతారు.
లోపల ఎరుపు లేదా వెండి దారం ఉంటే జరీ అసలైనది. తెలుపు లేదా ప్లాస్టిక్ దారం ఉంటే అది నకిలీ జరీ.
చీర కొసను చిన్న ఉంగరం ద్వారా లాగండి. అడ్డు లేకుండా వెళ్తే అసలైన పట్టు చీర. ఇరుక్కుపోతే, మెలితిరిగితే అది కల్తీ పట్టు కావచ్చు.
అసలైన బనారస్ చీరల్లో పూలు, ఆకులు, మామిడి, మొఘల్ డిజైన్లు ఉంటాయి. ఇవి వాటి ప్రత్యేకత.
అసలైన బనారస్ పట్టు చీరకు GI ట్యాగ్ ఉంటుంది. ఇది ఆ చీర వారణాసిలో తయారైందని హామీ ఇస్తుంది.
అసలైన బనారస్ పట్టు చీర ఖరీదైంది. ఎందుకంటే దీన్ని చేత్తో నేస్తారు, ఎంబ్రాయిడరీ చేస్తారు.
డ్రై ఫ్రూట్స్ అన్నింటికీ ఇవి తాతలాంటివి.. రోజూ రెండు తింటే చాలు
బొప్పాయి తింటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందా?
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవో కాదో ఇలా తెలుసుకోండి
తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. తర్వాత సమస్యలు కొని తెచ్చుకుంటారు