Relations
ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామి చేసే ప్రతీ పని అందంగా ఉంటుంది. అయితే పెళ్లయ్యాక అవే విసుగు పుట్టిస్తాయి. తమపై భాగస్వామి నుంచి ప్రాధాన్యత తగ్గుతోందని బాధపడుతుంటారు.
ప్రేమ వివాహం చేసుకున్న జంటలు తమంతట తాముగా సంసారం నెట్టుకొస్తారు. తల్లిదండ్రుల సహాయం తీసుకోరు. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఇవి గొడవలకు దారి తీస్తాయి.
ప్రేమ వివాహం చేసుకున్న కుటుంబాల్లో అత్తమామలతో గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది జంటల మధ్య దూరానికి దారి తీస్తుంది.
ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి అలవాట్లు మరొకరు ఎంతో ఇష్టపడ్డ జంటలు పెళ్లి తర్వాత పరిస్థితి మారిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలకు దారితీస్తాయి.
ప్రేమలో ఉన్నప్పుడు గంటల తరబడి మాట్లాడుకున్న జంటలు పెళ్లి తర్వాత మారిపోతారు. వృత్తిపరమైన టెన్షన్స్ తో భాగస్వామికి తక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇది కూడా గొడవలకు దారి తీస్తుంది