Food
అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి 6, కార్బోహైడ్రేట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల తక్షణమే ఎనర్జీ వస్తుంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది.
చియా విత్తనాలు ఫైబర్ కు మంచి మనరు. దీనిలోని కార్భోహైడ్రేట్లను తీసుకోవడం వల్ల మన ఎనర్జిటిక్ ఉంటాం. ఎలాంటి పనులను చేసినా అసలిపోయామనే ముచ్చటే ఉండదు.
గుడ్లు పోషకాల భాండాగారం. గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, విటమిన్ బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే కూడా మనం ఆరోగ్యంగా, రోజంతా శక్తివంతంగా ఉంటాం. ఇవి మన బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలను తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. చేపలు మన మెదడును ఆరోగ్యం ఉంచుతాయి. అలాగే శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి.
సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మకాయ వంటి పండ్లను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా మీరు ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. అందుకే వీటి రసాలను ఎనర్జిడ్రింక్స్ అని కూడా అంటారు.
గింజల్లో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ గింజలను తింటే మీరు శక్తివంతంగా ఉంటారు.