Lifestyle

డయాబెటిస్

డయాబెటీస్ పేషెంట్లకు బ్లూ టీ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే శంఖం పువ్వు, ఆకులకు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

Image credits: Getty

యాంటీ ఆక్సిడెంట్స్

బ్లూ టీ  యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనల్నిఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది. అయితే ఈ బ్లూ టీని తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ ఇట్టే పెరిగిపోతుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

బ్లూ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. దీనిలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గితే మన గుండెకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 
 

Image credits: Getty

మెరుగైన జీర్ణక్రియ

బ్లూ టీని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image credits: Getty

మానసిక ఒత్తిడి

శంఖం పువ్వుతో తయారుచేసే ఈ టీ మన ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే  ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

బ్లూ టీ కంటి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

బ్లూ టీ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని రెగ్యులర్ గా తాగొచ్చు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

బ్లూ టీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూ టీని రోజూ తాగితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

Image credits: Getty
Find Next One