సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నా సాక్సులు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
పరిశుభ్రత, శుభ్రపరచడం
శుభ్రం చేసినప్పటికీ ఇంట్లో నేలపై దుమ్ము, మురికి ఉంటుంది. సాక్స్ ధరించడం వల్ల వాటి నుండి పాదాలకు రక్షణ లభిస్తుంది. పాదాలు శుభ్రంగా ఉంటాయి.
రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది
సాక్స్ ధరించడం వల్ల పాదాలకు విశ్రాంతి లభిస్తుంది. చలి నుండి కూడా రక్షణ లభిస్తుంది. మీ పాదాలకు సరిపోయే సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అలసట కూడా తగ్గుతుంది.
చర్మానికి రక్షణ
చాలా మంది సెలబ్రిటీలు తమ చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక సాక్స్‌లను ధరిస్తారు. వీటిలో మాయిశ్చరైజింగ్ ప్రభావం ఉంటుంది. సాక్సులు పాదాలు పొడిబారకుండా, పగుళ్లు రాకుండా కాపాడతాయి.
చికిత్స అనంతరం భద్రత
సెలబ్రిటీలు పాదాల చర్మానికి చికిత్స చేయించుకున్నప్పడు, పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు ప్రత్యేక సాక్సులు వాడతారు. ఇవి వారి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
అలసట తగ్గుతుంది
సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి సాక్స్ ధరించడం వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇవి ధరించడం వల్ల అలసట, వాపు తగ్గుతుంది.
శక్తినిస్తాయి
సెలబ్రిటీలు డైలీ చాలా బిజీగా ఉంటారు. వారు సాక్స్ ధరించడం వల్ల విశ్రాంతి, శక్తి లభిస్తుంది. ఇది వారి బిజీ లైఫ్‌స్టైల్‌కు చాలా అవసరం.
యోగాలో కూడా సాక్స్
చాలా మంది సెలబ్రిటీలు యోగా లేదా ధ్యానం చేస్తున్నప్పుడు కాన్సనట్రేషన్ కోసం సాక్స్‌లను ధరిస్తారు. అంతేకాకుండా సౌకర్యం ఉండటం కోసం వేసుకుంటారు.