మీ మెదడుకు పదనుపెట్టే సరదా ప్రశ్నలు... సరికొత్త జవాబులు
సంవత్సరంలోనూ, శనివారంలోనూ ఒకేసారి వచ్చేది ఏమిటి?
జవాబు: సంవత్సరంలోనూ, శనివారంలోనూ తెలుగు అక్షరం 'వ' ఒకేసారి వస్తుంది.
మీ నగరంలో ఎన్ని ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి?
జవాబు: ఈ ప్రశ్న వినగానే చాలామంది తమ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఆలోచిస్తారు. కానీ, ట్రాఫిక్ లైట్లు అంటే ఎక్కడైనా మూడే రకాలు: ఎరుపు, ఆకుపచ్చ, పసుపు.
వరుసగా 3 రోజుల పేర్లు చెప్పండి.
కానీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాకూడదు?
జవాబు: నిన్న, ఇవాళ, రేపు
ఒక బల్ల మీద ప్లేట్‌లో రెండు ఆపిల్స్ ఉన్నాయి. ముగ్గురు ఎలా తింటారు?
జవాబు: ఒక బల్ల మీద, ప్లేట్‌లో రెండు ఆపిల్స్ ఉన్నాయి. అంటే బల్లమీద కూడా ఓ యాపిల్ వుందన్నమాట. ముగ్గురు ఒక్కొక్కటి తింటారు.