Lifestyle

వాషింగ్ మెషిన్ లో ఇవి మాత్రం ఉతకకూడదు

సిల్క్ దుస్తులు

సిల్క్ దుస్తులు చాలా మృదువుగా ఉంటాయి. వాషింగ్ మెషిన్ ప్రాసెస్ వేగంగా ఉంటుంది. దీని వల్ల సిల్క్ దుస్తుల మెరుపు తగ్గిపోతుంది. అందుకే.. వీటిని మెషిన్ లో కంటే  చేతితో ఉతకడం మంచిది.

 

 

ఉన్ని దుస్తులు

ఉన్ని దుస్తులను వాషింగ్ మెషిన్‌లో ఉతకడం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి వాటి నాణ్యత కూడా పోతుంది. కాబట్టి వీటిని చేతితో ఉతకడమే బెటర్.

లేస్ లేదా ఎంబ్రాయిడరీ దుస్తులు

భారీ లేస్, ఎంబ్రాయిడరీ లేదా జరీ వర్క్ ఉన్న దుస్తులను మెషిన్‌లో ఉతకకూడదు, లేకుంటే అవి చిక్కుకుపోయి చిరిగిపోతాయి.

బూట్లు

అన్ని రకాల బూట్లు వాషింగ్ మెషిన్‌లో ఉతకడానికి సరిపోవు. ముఖ్యంగా లెదర్, మృదువైన బట్టతో చేసిన బూట్లను వాషింగ్ మెషిన్‌లో ఉతకకూడదు.

ఫోమ్ దుస్తులు

ఫోమ్ లేదా మెమరీ ఫోమ్ ఉన్న దుస్తులు మెషిన్‌లో ఉతకడం వల్ల పాడవుతాయి, ఎందుకంటే వాటిలో సబ్బు కణాలు ఇరుక్కుపోతాయి.

లోహ వస్తువులు

కొన్నిసార్లు ప్యాంటు లేదా షర్టు జేబుల్లో నాణేలు, తాళాలు లేదా ఇతర లోహ వస్తువులు ఉండిపోతాయి. ఇవి మెషిన్ డ్రమ్‌ను పాడు చేస్తాయి. కాబట్టి ఈ వస్తువులను మెషిన్‌లో వేయకూడదు.

ఫ్రిల్స్, స్టడ్స్ దుస్తులు

ఈ దుస్తులకు ఉన్న స్టడ్స్, బటన్లు లేదా చైన్లు వాషింగ్ మెషిన్ తిరగడం వల్ల విరిగిపోతాయి లేదా ఇతర దుస్తులలో చిక్కుకుపోతాయి. వీటిని చేతితో ఉతకడం సురక్షితం.

బ్లేజర్లు, సూట్లు

వాషింగ్ మెషిన్‌లో ఉతకడం వల్ల బ్లేజర్లు, సూట్ల ఫిట్టింగ్ పాడవుతుంది. వీటిని ఎల్లప్పుడూ డ్రై క్లీన్ చేయించాలి.

కిచెన్ క్లీనింగ్ దుస్తులు

కిచెన్‌లో వాడే దుస్తులకు నూనె మరకలు ఉంటాయి. వాటికి ఉన్న నూనె మరకలు మిషెన్ వదిలించకపోవచ్చు.

బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా

ఘటోత్కచుడు చనిపోతే కృష్ణుడు సంతోషించాడా? కారణం ఇదే

మహిళలు బ్రా ఎంతకాలం వాడాలి?

పిండిలో ఇదొక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా, తెల్లగా ఉంటాయి