Food

పిండిలో ఇదొక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా, తెల్లగా ఉంటాయి

చపాతీలు మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి?

చపాతీలు మెత్తగా రావాలని, బాగా పొంగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఇందుకు ఒకటి బాగా ఉపయోగపడుతుంది. 

పెరుగు

అవును పెరుగుతోొ మెత్తని, తెల్లని చపాతీలను తయారుచేయొచ్చు. ఇందుకోసం చపాతీ పిండిలోఒకటి లేదా రెండు చెంచాల పెరుగు వేసి కలపండి.పెరుగు పిండిని మెత్తగా చేస్తుంది.చపాతీలు బాగా పొంగుతాయి.

పెరుగు

మెత్తగా అవుతాయని పిండిలో పెరుగును ఎక్కువగా వేస్తే మాత్రం పిండి జిగటగా అవుతుంది. అందుకే సరిపడినంత పెరుగును మాత్రమే వేయాలి. ఒక కప్పు పిండికి 1 నుంచి 2 చెంచాల పెరుగు వేస్తే సరిపోతుంది

నీళ్లు

పిండిలో పెరుగును వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం నీళ్లను పోస్తూ పిండిని కలపండి. దీనివల్ల పిండి గట్టి పడదు. జిగటగా మారదు. 

పిండిని బాగా కలపండి

చపాతీలు మెత్తగా రావాలన్నా బాగా పొంగాలన్నా పిండిని బాగా కలపాలి. పిండి కలిపిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే చపాతీలు చేయకూడదు. 

పెనం వేడి చేయాలి

చపాతీలు కాల్చడానికి ముందు పెనాన్ని బాగా వేడవ్వనివ్వాలి. వేడి పెనం మీద చపాతీలు చాలా తొందరగా పొంగుతాయి. అలాగే ఇవి మెత్తగా ఉంటాయి. 

మటన్ లివర్ తింటే ఏమౌతుందో తెలుసా?

అంజీర్ లో పురుగులు ఉంటాయా?

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా