Lifestyle
తప్పుడు శరీర భంగిమ మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కాబట్టి నిటారుగా నిలపడండి. కుర్చున్నప్పుడు కూడా భుజాలు వెనక్కి, మెడ నిటారుగా ఉంచండి.
నడిచే సమయంలో హడావిడిగా నడవకూడదు. నిదానంగా నడవాలి. మీ అడుగుల్లో సౌమ్యత ఉండాలి. శరీర కదలికలను నియత్రించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మాట్లాడేటప్పుడు స్వరం నెమ్మదిగా, మధురంగా ఉంచండి. కోపంలో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ఇది మిమ్మల్ని మరింత గౌరవప్రదంగా చూపిస్తుంది.
మాట్లాడేటప్పుడు చేతులను ఎక్కువగా ఉపయోగించవద్దు. నియంత్రిత హావభావాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. కళ్ళతో సంబంధం కొనసాగించండి, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు.
దుస్తులలో సరళత, మర్యాదను పాటించండి. ఏది ధరించినా ఆత్మవిశ్వాసంతో ఉండండి. రంగులు, అలంకరణలను జాగ్రత్తగా ఎంచుకోండి.
కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉండటం అందమైన వ్యక్తిత్వానికి చిహ్నం. విమర్శలను, అభిప్రాయ భేదాలను సులువుగా తీసుకోండి.
సంభాషణలో మాట్లాడటంపైనే కాదు, వినడంపై కూడా దృష్టి పెట్టండి. ఎవరినైనా శ్రద్ధగా వినడం గౌరవం, అవగాహనను చూపిస్తుంది.
యోగా, ధ్యానం ద్వారా శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. ప్రవర్తనలో సౌమ్యత వస్తుంది. ఇది మానసిక సమతుల్యతను కాపాడుతుంది.