Lifestyle

డబ్బు కంటే విలువైంది ఏంటో తెలుసా

డబ్బు కంటే ముఖ్యమైనదేమిటి?

చాణక్యుడు తన నీతి  శాస్త్రంలో.. జనాలకు డబ్బు గర్వం మంచిది కాదని చెప్పాడు. ఎందుకంటే డబ్బుకంటే ముఖ్యమైనవి, విలువైనవి చాలా ఉన్నాయి. అవేంటంటే? 

ధర్మం చాలా ముఖ్యం

చాణక్య నీతి ప్రకారం.. ధర్మం డబ్బు కంటే విలువైంది. ముఖ్యమైంది. ధర్మం, డబ్బు రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే ధర్మాన్నే ఎంచుకోవాలంటాడు చాణక్యుడు. 

స్వగౌరవం కూడా ముఖ్యమే

డబ్బు కంటే స్వగౌరవం చాలా ముఖ్యమంటాడు చాణక్యుడు. గౌరవం విషయంలో డబ్బును అస్సలు లెక్కచేయకూడదు. పోయిన డబ్బును మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ స్వగౌరవం కాదు.

బంధాలను కాపాడుకోవాలి

బంధాల  విషయంలో డబ్బు గురించి ఆలోచించేవాడు అవివేకుడేనంటాడు చాణక్యుడు. ఎందుకంటే డబ్బు లేకపోయినా బతకొచ్చు. కానీ ఫ్యామిలీ, బంధువులు లేకుండా బతకడం జీవితం వ్యర్థం.

Find Next One