Lifestyle

ఒకటి కాదు రెండు కాదు ఉప్పులో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

టేబుల్ సాల్ట్

టేబుల్ సాల్ట్ అనేది అయోడైజ్డ్ సాల్ట్. ఇది మన శరీరంలో థైరాయిడ్ సరైన పనితీరుకు అవసరం. సాధారణంగా దీనిని వంట చేయడానికి లేదా సలాడ్‌లలో ఉపయోగిస్తారు. 

సముద్రపు ఉప్పు

సముద్రపు ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ కంటే దీని రుచి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనిని వంటకు  ఉపయోగిస్తారు.

హిమాలయన్ పింక్ సాల్ట్

హిమాలయన్ పింక్ సాల్ట్ హిమాలయాల్లో లభిస్తుంది. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలోని PH స్థాయిని సమతుల్యం చేస్తుంది. 

కోషర్ సాల్ట్

కోషర్ సాల్ట్‌లో పెద్ద పెద్ద కణాలు ఉంటాయి. దీనిని సాధారణంగా మసాలా దినుసులు, మాంసం గ్రేవీ తయారీలో ఉపయోగిస్తారు.

సెల్టిక్ సముద్రపు ఉప్పు

సెల్టిక్ సముద్రపు ఉప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉప్పును స్నానపు నీటిలో కూడా వాడొచ్చు.

నల్ల రాతి ఉప్పు

నల్ల రాతి ఉప్పు సాధారణ ఉప్పు కంటే భిన్నంగా ఉంటుంది. ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా అవసరం. అలాగే శరీరంలోని వాపును కూడా తగ్గిస్తుంది.

ఎర్ర హవాయి ఉప్పు

ఎర్ర హాయి ఉప్పును అలేయా ఉప్పు అని కూడా అంటారు. దీనిలో అగ్నిపర్వత మట్టి ఉంటుంది. ఇది ఇనుము ఆక్సైడ్ వంటి ఖనిజాలను పెంచుతుంది.దీనిని వంటలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

రాతి ఉప్పు

 రాతి ఉప్పులో అయోడిన్ తక్కువగా ఉంటుంది. ఈ ఉప్పును సాధారణంగా ఉపవాస సమయంలో బాగా ఉపయోగిస్తారు.

Find Next One