Telugu

గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి

Telugu

మూత పెట్టాలి

మీరు ఏ వంట చేసినా ఖచ్చితంగా మూతపెట్టండి. ఎందుకంటే దీనివల్ల వంట త్వరగా అవుతుంది. దీంతో గ్యాస్ ఆదా అవుతుంది.  సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది.

Image credits: Getty
Telugu

చిన్న గిన్నెలె

ఎంత వంటకు అంత గిన్నెలనే వాడాలి. చాలా మంది తక్కువ వంటకైనా పెద్ద పెద్ద గిన్నెలను వాడుతుంటారు. కానీ వీటిని వాడితే గ్యాస్ తొందరగా అయిపోతుంది. 

Image credits: Getty
Telugu

ప్రెషర్ కుక్కర్

గ్యాస్ ను ఆదా చేయడంలో ప్రెషర్ కుక్కర్ బాగా పనిచేస్తుంది. మీరు వీటిలో అన్నాన్ని, కూరలు, పప్పు, సూప్ వంటి వాటిని కేవలం నాలుగైదు నిమిషాల్లోనే వండేయొచ్చు.

Image credits: Getty
Telugu

గ్యాస్ లీకేజ్

గ్యాస్ లీకేజీని చాలా మంది గమనించరు. వీటివల్ల గ్యాస్ తొందరగా అయిపోతుంది. అందుకే మంట రంగులో ఏ మార్పు వచ్చినా చెక్ చేయండి. 

Image credits: Getty
Telugu

ముందుగా సిద్ధం చేసుకోండి

మీరు వంట చేయడానికి కావాల్సిన వాటన్నింటినీ ఒక దగ్గర పెట్టండి. అప్పుడే వంట తొందరగా అవుతుంది. గ్యాస్ వేస్ట్ కాదు. 

Image credits: Getty
Telugu

సిమ్ లో వాడండి

గ్యాస్ ను సిమ్ లో వాడితే గ్యాస్ ఆదా అవడమే కాకుండా వంటలు కూడా టేస్టీగా అవుతాయి. బాగా ఉడుకుతాయి. 

Image credits: Getty
Telugu

తక్కువ వంటకాలు

గ్యాస్ స్టవ్ మీద వంటలను తక్కువగా చేయడమే మంచిది. ఇది కొంతవరకు గ్యాస్ ను ఆదా చేస్తుంది. 

Image credits: Getty

వాల్నట్స్ ఎవరు తినకూడదు?

Gold: 2 గ్రాముల్లోనే జుంకాలు..ఎవరికైనా నచ్చేయాల్సిందే

అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు

ఇవి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. వెంట్రుకలు ఊడిపోవు