బియ్యాన్ని బాగా కడిగే వండాలి. కడగకుండా వండితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బియ్యంలో పురుగులతో పాటుగా దుమ్ము, ధూళి కూడా ఉంటాయి. ఇవి మన శరీరంలోకి వెళితే అలెర్జీ, జీర్ణ సమస్యలతో పాటుగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మీరు గనుక బియ్యాన్ని కడగకుండా వండితే అన్నం రుచి మారుతుంది. అలాగే అన్నం వింత వాసన కూడా వస్తుంది. దీనివల్ల అన్నాన్ని తినాలనిపించదు.
బియ్యాన్ని కడగకుండా వండితే ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే అన్నం అంటుకుంటుంది.
మీరు బియ్యాన్ని కడగకుండా వండితే అది సరిగ్గా ఉడకదు. ఇలాంటి అన్నాన్ని తింటే జీర్ణం కావడం కూడా కష్టమే.
బియ్యాన్ని ఖచ్చితంగా రెండు మూడు సార్లు శుభ్రమైన నీళ్లతో బాగా కడిగే వండాలి. ఇదే ఆరోగ్యానికి మంచిది.
బియ్యాన్ని కడిగిన వెంటనే వండేయకుండా ఒక 10 నిమిషాలైనా నానబెట్టాలి. దీనివల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది.
నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?
ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు
వీళ్లు కాఫీ అస్సలు తాగకూడదు
బరువు తగ్గాలనుకుంటే ఈ కూరగాయలు మాత్రం తినకండి