Lifestyle
రాత్రిపూట తొందరగా నిద్రపట్టాలంటే మీరు ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవాలి. అలాగే రాత్రిపూట తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్రలేవాలి. ఈ అలవాటు మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది.
వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయండి.
మీరు బాగా నిద్రపోవాలంటే మీ రూంలో మంచి వాతావరణం ఉండాలి. అంటే మీరు పడుకునే బెడ్, దిండు, బెడ్ షీట్ బాగుండాలి. అలాగే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి.
మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి మీ మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు బుక్స్ చదవడం, శ్వాస వ్యాయామాలు లాంటివి చేయండి.
మీరు నిద్రపోవాలంటే మాత్రం పడుకునే ముందు ఫోన్, టీవీ, ల్యాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అస్సలు చూడకూడదు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వెళుతురు మీకు నిద్రపట్టకుండా చేస్తాయి.
ఎంత ఇష్టమైనా పడుకునే ముందు మాత్రం కాఫీని అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ నిద్రమత్తును వదిలించి మిమ్మల్ని ఉత్సాహంగా మారుస్తుంది. కాబట్టి పడుకునే ముందు కాఫీని అస్సలు తాగకండి.
రాత్రిళ్లు వీలైనంత తేలికపాటి భోజనమే చేయాలి. హెవీగా తింటే మీకు నిద్రపట్టదు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కూడా చేయకూడదు. ఇవి మీకు నిద్రలేకుండా చేస్తాయి.