Lifestyle

కోడి నుంచి కాఫీ వరకు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహారాలు

Image credits: Getty

వైట్ ట్రఫిల్స్

ఉత్తర ఇటలీలో ఇవి పెరుగుతాయి. ప్రత్యేక వాతావరణంలో మాత్రమే ఇవి పెరుగుతాయి. దీని ధర పౌండుకు రెండున్నర లక్షల రూపాయలు.

Image credits: Getty

మాట్సుటేక్ మష్రూమ్స్

జపాన్‌లోని తాంబ ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. కొరియన్, జపనీస్ వంటకాల్లో ప్రధానంగా వాడతారు. పౌండుకు 5,000 నుండి 1.5 లక్షల వరకు ధర ఉంటుంది.

Image credits: Getty

అయం సెమాని బ్లాక్ చికెన్

ఇండోనేషియాకు చెందిన ఒక ప్రత్యేకమైన రకం కరి చికెన్ ఇది. దీని రక్తం తప్ప మిగతావన్నీ నల్లగా ఉంటాయి. ఒక జత ధర 3.7 లక్షల వరకు ఉంటుంది.

Image credits: Getty

అల్మాస్ కావియార్

అరుదైన ఆడ ఆల్బినో స్టర్జన్ చేప గుడ్ల నుండి తయారుచేసే ప్రత్యేకమైన వంటకం ఇది. ఇది అంతరించిపోతున్న చేప. దీని ధర 25 లక్షలకు పైగా ఉంటుంది.

Image credits: Getty

యుబారి కింగ్ మెలాన్

జపాన్‌లోని యుబారి నుండి వచ్చే ఇది ఒక లగ్జరీ పండు. హోదా చిహ్నంగా దీన్ని బహుమతిగా కూడా ఇస్తారు. 20 లక్షల రూపాయల ధర కూడా పలుకుతాయి.

Image credits: Getty

కుంకుమపువ్వు

రెడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆసియా నుండి వచ్చే ఈ ప్రత్యేకమైన కుంకుమపువ్వు ధర కిలోకు 3 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది.

Image credits: Getty

కోపి లువాక్ కాఫీ

సివెట్ కాఫీ గా గుర్తింపు పొందిన ఈ కాఫీని ఇండోనేషియాలో ఉత్పత్తి చేస్తారు. ఈ కప్పు కాఫీ ధర 8000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

Image credits: Getty

భారీ వర్కౌట్లతో పనిలేదు.. మీ బరువు తగ్గించే పండ్లు ఇవి

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే

ఇవి ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి..

చలికాలంలో నారింజ పండ్లు తినొచ్చా? ఏం జరుగుతుంది?