క్లీనర్‌లను బాగా గాలి వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. కిచెన్ సింక్ కింద వీటిని ఉంచడం సురక్షితం కాదు.
వంటగదిలో వాడే చిన్న పరికరాలను సింక్ కింద అస్సలు పెట్టొద్దు. నీటి లీకేజీ అయితే పరికరాలు పాడైపోయే ప్రమాదం ఉంది.
పేపర్ టవల్స్, బ్యాగులు లాంటివి సింక్ కింద పెట్టొద్దు. ఎందుకంటే సింక్ కింద ఎప్పుడూ తేమగా ఉండే అవకాశం ఎక్కువ.
మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నందున, మండే వస్తువులను సింక్ కింద అస్సలు ఉంచకూడదు.
వంటగదిలో వాడే గాజు పాత్రలు లేదా ఇతర వస్తువులను సింక్ కింద పెట్టొద్దు. అవి పగిలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
సింక్ కింద తేమ, మురికి, క్రిములు ఉంటాయి. కాబట్టి పెంపుడు జంతువుల ఆహారాన్ని ఇక్కడ ఉంచడం అస్సలు సురక్షితం కాదు.
సింక్ కింద స్థలం ఉన్నా వస్తువులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ తేమ, మురికి ఉంటాయి. ఇది వస్తువులు త్వరగా పాడవడానికి కారణమవుతుంది.
రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా? ఇవి తింటే చాలు
కివి ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ తో ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు
డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే!