Lemon: నిమ్మకాయను ఇన్ని రకాలుగా కూడా వాడొచ్చని మీకు తెలుసా?
life Jan 16 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ఫ్రిజ్‌లోని దుర్వాసన
ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంటుంది. ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగించడానికి నిమ్మకాయ చాలు. ఒక గిన్నెలో నిమ్మకాయను ఉంచితే సరి.
Image credits: Getty
Telugu
దుస్తులపై మరకలు..
దుస్తులపై పడిన మొండి మరకలను తొలగించడానికి కూడా నిమ్మకాయ పనిచేస్తుంది. మరక ఉన్న బట్టను చల్లటి నీటిలో నానబెట్టాలి. తర్వాత నిమ్మకాయతో బాగా రుద్ది ఉతికితే చాలు.
Image credits: Getty
Telugu
ఆహార పదార్థాల దుర్వాసన
వంటగదిలో వచ్చే ఆహార పదార్థాల దుర్వాసనను నిమ్మకాయతో సులభంగా తొలగించవచ్చు. నీటిలో నిమ్మరసం కలిపి వంటగదిలో స్ప్రే చేస్తే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
బెడ్‌షీట్ శుభ్రత
బెడ్‌షీట్‌ను శుభ్రం చేయడానికి, మంచి సువాసన రావడానికి నిమ్మకాయ మంచిది. వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసి, ఆ నీటిలో బెడ్‌షీట్‌ను నానబెట్టాలి.
Image credits: Getty
Telugu
మైక్రోవేవ్ శుభ్రపరచడం
నిమ్మకాయను ఉపయోగించి మైక్రోవేవ్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో నిమ్మకాయ, నీళ్లు కలిపి మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. తర్వాత క్లాత్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది..
Image credits: Getty
Telugu
కటింగ్ బోర్డ్
వంటగదిలో వాడే కటింగ్ బోర్డును శుభ్రపరిచి, క్రిమిరహితం చేయడానికి నిమ్మకాయ చాలు. కటింగ్ బోర్డుపై కొద్దిగా ఉప్పు చల్లి, నిమ్మకాయతో బాగా రుద్ది కడిగితే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
సింక్‌లోని దుర్వాసన
నిమ్మకాయతో వంటగది సింక్‌లోని దుర్వాసనను తొలగించవచ్చు. కొద్దిగా నీటిలో నిమ్మరసం కలిపి సింక్‌లో పోస్తే సరిపోతుంది.