Telugu

ఈ హెల్దీ డ్రింక్స్‌తో హెయర్ ఫాల్ సమస్యకు చెక్.. జన్మలో జుట్టు రాలదు

Telugu

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీర వేడిని తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్లకు తేమ అందించి, రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మోకాళ్ల వరకూ పెరిగేలా చేస్తుంది.

Image credits: Pinterest
Telugu

కలబంద రసం (Aloe Vera Juice)

కలబందలోని ఎంజైమ్‌లు తలపై ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వేసవిలో వచ్చే దురద, చుండ్రును తగ్గించడానికి ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి.

Image credits: Getty
Telugu

ఉసిరి రసం (Amla Juice)

విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు ఉసిరిలో ఉంటాయి. ఇది జుట్టు తెల్లబడటాన్ని తగ్గించి, కుదుళ్లను బలపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

కీరదోస రసం (Cucumber Juice)

కీరదోసలో ఉండే సిలికా, సల్ఫర్ జుట్టుకు బలాన్ని ఇస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. కరివేపాకు రసం కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.

Image credits: Getty
Telugu

క్యారెట్ జ్యూస్ (Carrot Juice)

విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ జ్యూస్, తలపై సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది జుట్టు పొడిబారకుండా చేసి, జుట్టు మెరిసేందుకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పాలకూర స్మూతీ (Spinach Smoothie)

పాలకూరలో ఐరన్, ఫోలేట్ (Folate) ఎక్కువగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu

పుదీనా, నిమ్మరసం (Mint Lemonade):

పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి తలని శుభ్రంగా ఉంచి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
Image credits: Getty

Blouse Designs: ఈ బ్లౌజులు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Gold Nose Pin: ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!

Bandhani Suit: బ్యూటిఫుల్ బాందనీ కుర్తాసెట్.. సమ్మర్ కి బెస్ట్ ఛాయిస్

Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు