Telugu

Hair Care : జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి

Telugu

పాలకూర

పాలకూరలో ఉండే ఇనుము, విటమిన్ A, B6, C, ఫోలేట్ వంటి పోషకాలు జుట్టు వృద్ధికి సహాయపడతాయి. జుట్టు బలంగా, దట్టంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

గుడ్డు

గుడ్డు ఒక మంచి ప్రోటీన్ వనరు. ఇందులో బయోటిన్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండటంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

నట్స్, గింజలు

బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ గింజలు, చియా గింజల్లో ఒమేగా-3, బయోటిన్, జింక్, విటమిన్-ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న సాల్మన్ చేప తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పప్పు ధాన్యాలు

 పప్పు ధాన్యాల్లో ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్ వంటి పోషకాలతో పాటు ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలకుండా ఉండటానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

పండ్లు

విటమిన్ సి పుష్కలంగా ఉండే జామ, ఉసిరి, సిట్రస్ పండ్లు వంటివి తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: pinterest

Constipation: మీ డైట్​లో వీటిని చేర్చుకుంటే.. మలబద్ధకం ఇట్టే పరార్..

Health Tips: రన్నింగ్ చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా ?

Kidney Failure: ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీలు ఫెయిల్ అయినట్టు!

Weight Loss: నెల రోజుల్లో బరువు తగ్గి.. స్లిమ్‌ అయ్యే సూపర్ టిప్స్..