రన్నింగ్ ఒక మంచి కార్డియో వ్యాయామం. ఇది గుండెను బలపరచుతుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తద్వారా గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
బరువు నియంత్రణ
రన్నింగ్ కేలరీలు ఖర్చు చేయడానికి చాలా ప్రభావవంతమైన వ్యాయామం. రోజూ 30–45 నిమిషాలు రన్నింగ్ చేయడం వల్ల అదనపు కొవ్వు కరుగుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది.
Image credits: freepik
Telugu
మానసిక ఆరోగ్యానికి మేలు
రన్నింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఒత్తిడి, నిరాశను తగ్గించి, మానసికఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందువల్ల రన్నింగ్ శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి మేలు
Image credits: freepik
Telugu
ఎముకలు, కీళ్ళు బలపడతాయి
రన్నింగ్ చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. సరైన పద్ధతిలో రన్నింగ్ చేస్తే ఎముకలు బలపడుతాయి,
Image credits: freepik
Telugu
మెరుగైన నిద్ర
క్రమం తప్పకుండా రన్నింగ్ చేసే వారికి గాఢమైన, ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. ఇది పగటి అలసటను తగ్గించి, రాత్రి శరీరానికి అవసరమైన విశ్రాంతిని అందిస్తుంది.
Image credits: freepik
Telugu
క్రమశిక్షణ, ఓర్పు
రన్నింగ్ కేవలం వ్యాయామం మాత్రమే కాదు. అది ఒక జీవనశైలి. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో రన్నింగ్ చేస్తే వ్యక్తిత్వంలో క్రమశిక్షణ, ఓర్పు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.