వేగంగా కూరగాయలు కట్ చేస్తుంటే.. ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే… దాని కింద ఒక పేపర్ టవల్ ఉంచాలి. అప్పుడు వేగంగా కట్ చేయగలరు.
వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా? ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు వేసి గట్టిగా ఊపితే చాలు, పొట్టు సులభంగా ఊడివస్తుంది.
చెర్రీలు, ద్రాక్ష లాంటి పండ్ల గింజలను తీయడానికి ఒక స్ట్రా వాడండి. పండు మధ్యలో స్ట్రాతో గుచ్చితే గింజ సులభంగా బయటకు వస్తుంది.
నిమ్మకాయ, నారింజ నుంచి ఎక్కువ రసం తీయాలా? వాటిని 5-7 సెకన్ల పాటు మైక్రోవేవ్‌లో వేడి చేసి, ఆ తర్వాత రసం పిండండి. ఇలా చేేస్తే రసం ఎక్కువ వస్తుంది.
గాజు పాత్రలు కొత్తవాటిలా మెరవాలంటే, వాటిని కడిగే ముందు వెనిగర్, నీళ్ల మిశ్రమంలో కాసేపు నానబెట్టండి.
చాకులు, ఫోర్క్‌లకు అంటుకున్న జిడ్డును వదిలించడానికి వాటిపై నిమ్మకాయ తొక్కతో బాగా రుద్దండి.
పనీర్ నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా మృదువుగా ఉండాలంటే, దాన్ని కాసేపు వేడి నీటిలో నానబెట్టండి.
Cracked Heels: రాత్రి ఇలా చేశారంటే పాదాల పగుళ్లు ఉదయానికి మాయం
Bangle Designs: చేతలకు రాజసం ఉట్టిపడేలా యాంటిక్ గోల్డ్, ముత్యాల గాజులు
Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?
Pattu Sarees: మగువల మనసు దోచే బ్యూటిఫుల్ పట్టు చీరలు.. చూస్తే ఫిదా!