ఏసీ మీ చర్మాన్ని పాడుచేస్తోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
life Apr 25 2026
Author: Arun Kumar P Image Credits:Getty
Telugu
చర్మం బాగా బిగుతుగా, పొడిగా మారడం..
ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండటం వల్ల గాలి చర్మంలోని సహజ నూనెలను (Natural Oils) పీల్చేస్తుంది. దీనివల్ల చర్మం బాగా బిగుతుగా, పొడిగా అనిపిస్తుంది.
Image credits: Asianet News
Telugu
చర్మం సహజమైన మెరుపును కోల్పోవడం
చర్మానికి తగినంత తేమ అందనప్పుడు ముఖం కళ తప్పినట్లు కనిపిస్తుంది. చర్మం తన సహజమైన మెరుపును కోల్పోతుంది.
Image credits: Asianet News
Telugu
దురద, ఎర్రటి మచ్చలు రావడం
అతిగా చల్లదనం తగలడం వల్ల చర్మం సెన్సిటివ్‌గా మారుతుంది. దీనివల్ల దురద పెట్టడం, చర్మం కొద్దిగా పొట్టులా రాలడం వంటివి గమనించవచ్చు.
Image credits: Asianet News
Telugu
పెదవులు పదేపదే పొడిబారి పగలడం
శరీరంలోని ఇతర భాగాల కంటే ఏసీ గాలి పెదవుల్లోని తేమను వేగంగా పీల్చేస్తుంది. అందుకే పెదవులు ఎప్పుడూ పొడిబారి, పగిలినట్లు ఉంటాయి.
Image credits: Asianet News
Telugu
ముఖంపై సన్నటి గీతలు, ముడతలు కనిపించడం
తేమ తగ్గడంతో చర్మం తన ఎలాస్టిసిటీని (సాగే గుణం) కోల్పోతుంది. దీంతో ముఖంపై సన్నటి గీతలు, ముడతలు త్వరగా కనిపిస్తాయి.
Image credits: Asianet News
Telugu
ముఖంపై జిడ్డు ఎక్కువగా అనిపించడం
ఏసి గాలివల్ల పొడిబారడంతో చర్మం దానంతట అదే ఎక్కువగా నూనెను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఏసీలో ఉన్నప్పటికీ ముఖం జిడ్డుగా అనిపిస్తుందంటే ఇది కూడా ఒక లక్షణమే.