యాపిల్స్‌లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అవకాడోలో విటమిన్ సి, బి, కె పుష్కలంగా ఉంటాయి. ఇది వికారాన్ని నివారిస్తుంది. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.
అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే, వీటిని మితంగా తీసుకోవాలి.
నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వాంతులు, వికారం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నారింజలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ఇది కణాల నష్టాన్ని నివారిస్తుంది.
Jhumka Earrings: పట్టుచీరల మీదకు అదిరిపోయే ట్రెండీ జుంకా డిజైన్లు
Patiala Suit: అదిరిపోయే డిజైన్ లో పటియాల సూట్స్.. చూస్తే ఫిదా!
Chicken Curry: చికెన్ కూరలో పెరుగు కలిపితే ఏమౌతుంది?
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే