ల్ఎలప్పుడైనా సరే మొక్కలకు అవసరానికి మించి నీళ్లను ఎక్కువగా పోయకూడదు. ఎందుకంటే దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ అందక, మొక్క కుళ్లిపోయి చనిపోతుంది.
మొక్కలకి నీళ్లను మరీ తక్కువగానూ పోయకూడదు. ఎందుకంటే దీనివల్ల వేర్లు ఎండిపోయి మొక్క చనిపోతుంది.
చాలా మంది మొక్కలకు రాత్రిపూటే నీళ్లను పోస్తుంటారు. కానీ రాత్రిపూట మొక్కలకు నీళ్లను పట్టడం వల్ల తేమ పెరిగి వాటికి ఫంగస్ వస్తుంది.
మొక్కలకు మధ్యాహ్నం పూట కూడా నీళ్లను పట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల వేర్లకు నీళ్లు సరిగ్గా అందవు. మొక్కలకు ఉదయం పూటే నీళ్లను పోయడం మంచిది.
మొక్కలకు ఎప్పుడో ఒకసారి నీళ్లను పోయడం వల్ల మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉండదు. మొక్కలు హెల్తీగా ఉండాలంటే క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి.
కుండీల్లోని మొక్కలకు నీళ్లను పోసిన తర్వాత అవి బయటకు వెళ్లిపోయేలా చేయాలి. నీళ్లు నిల్వ ఉంటే వేర్లు కుళ్లిపోయి మొక్క చనిపోతుంది.
మొక్కలకు నీళ్లు పోసేటప్పుడు పూలు, ఆకుల మీద పోయకుండా చూసుకోవాలి.
ఈ మెడిసిన్ మొక్కలను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు
ఈ మొక్కలుంటే మీ ఇంటికి పాములు అస్సలు రావు
ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి
ఈ మొక్కలతో జుట్టు సమస్యలు మటుమాయం