Jeera Water : ఉదయాన్నే జీరా నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
జీర్ణ సమస్యలకు చెక్
ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
బాడీ డిటాక్సిఫై
జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
డీహైడ్రేషన్ కు చెక్
డీహైడ్రేషన్‌కు జీరా వాటర్ ఉత్తమం. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగవచ్చు.
Image credits: Getty
Telugu
గుండెకు మేలు
పొటాషియం అధికంగా ఉండే జీలకర్ర, అధిక రక్తపోటును నివారించి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
డయాబెటిస్
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో జీలకర్ర నీరు సహాయపడుతుంది. ఉదయం పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
మెరిసే చర్మం
జీరానీరు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది.