స్వీట్లు, చాక్లెట్లు, కేకులు, కుకీలు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిలో రిఫైన్డ్ షుగర్, మైదా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.
Image credits: Getty
Telugu
తీపి కలిపిన తృణధాన్యాలు (సిరియల్స్)
మార్కెట్లో దొరికే స్వీట్ సిరియల్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. వీటిలో అదనపు చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
Image credits: Getty
Telugu
సోడాలు, ఎనర్జీ డ్రింక్స్
సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర లేదా హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మోతాదుకు మించి ఉంటుంది. ఇవి షుగర్ పేషెంట్లకు చాలా ప్రమాదకరం.
Image credits: Getty
Telugu
పండ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్)
పండ్ల రసాలు, ప్యాక్ చేసిన ఫ్రూట్ డ్రింక్స్ తయారీలో ఆరోగ్యకరమైన ఫైబర్ తొలగిపోతుంది. దీనివల్ల వాటిలోని చక్కెర రక్తంలోకి చాలా వేగంగా కలిసిపోతుంది.